తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఎంత ఫోకస్డ్‌గా ఉందో తెలియాలంటే అమిత్‌షా వరుస టూర్లు చూస్తే అర్థమవుతుంది. గతనెల 27నే తెలంగాణకు వచ్చి వెళ్లారు అమిత్‌షా. ఖమ్మం వేదికగా ఎన్నికల శంఖారావం పూరించి, తెలంగాణ కాషాయ దళానికి ఎలక్షనోపదేశం చేశారు. అంతకుముందు చేవెళ్లకు వచ్చి విజయసంకల్పం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. ఖమ్మంకి వచ్చి వెళ్లి కనీసం 20రోజులు కూడా తిరక్క ముందే మళ్లీ హైదరాబాద్ వస్తున్నారు. అదీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం రోజు!. అంటే సెప్టెంబర్ 17వ తేదీన అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ప్రతి సందర్భాన్నీ తమను అనుకూలంగా మలుచుకుంటోన్న బీజేపీ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వినియోగించుకునేందుకు వ్యూహరచన చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ విమోచన దినోత్సవాన్ని మరింత హైలెట్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకే హైదరాబాద్ వస్తున్నారు అమిత్ షా.
ముందు ఫిక్స్ అయిన షెడ్యూల్ ప్రకారమైతే అమిత్ షా ఈ నెల 17న హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే, ఒక్కరోజు ముందే, అంటే సెప్టెంబర్ 16న రాత్రికే వస్తారంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పదహారున రాత్రి ఏడు గంటల 55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారు అమిత్‌షా. అక్కడ్నుంచి రోడ్డుమార్గం ద్వారా సీఆర్పీఎఫ్ సెక్టార్స్‌కు చేరుకొని బస చేస్తారు. తర్వాతి రోజు సికింద్రాబాద్ పరేడ్స్ గ్రౌండ్స్‌లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఇక, ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అమిత్‌షా మెయిన్ టార్గెట్ మాత్రం కేసీఆర్ అండ్ ఓవైసీనే!. చేవెళ్ల, ఖమ్మం సభల్లో కేసీఆర్ అండ్ పరివార్ టార్గెట్‌గానే నిప్పులు చెరిగారు. అంతేకాదు, బీజేపీ అధికారంలోకొస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ ప్రకటించారు. మరి, ఈసారి ఎలాంటి సంచలన ప్రకటనలు ఉంటాయో!. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారో చూడాలి!.
కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నిరుద్యోగులకు అండగా బిజెపి తెలంగాణ అధ్యక్షులు శ్రీ @kishanreddybjp గారి సారథ్యంలో 24 గంటల ఉపవాస దీక్ష. pic.twitter.com/k9KkPtdpKS
— BJP Telangana (@BJP4Telangana) September 12, 2023
సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు బిజెపి కార్యాచరణ. pic.twitter.com/52O0ImuaTs
— BJP Telangana (@BJP4Telangana) September 10, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..