Hyderabad: నీ టైం వచ్చేవరకు ఆగాల్సింది కదా బ్రో.. పెళ్లి అవ్వడం లేదని ఎంత పని చేశాడు..

వయసు పెరుగుతున్నా పెళ్లి కుదరకపోవడంతో ఆందోళన చెందిన ఓ యువకుడు జీవితాన్ని ముగించుకున్న ఘటన హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం హనకొండకు చెందిన 32 ఏళ్ల బుర్రా నరేష్‌ సరైన సంబంధం దొరకక నిరాశకు గురై రైల్వే ట్రాక్‌పై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad: నీ టైం వచ్చేవరకు ఆగాల్సింది కదా బ్రో.. పెళ్లి అవ్వడం లేదని ఎంత పని చేశాడు..
Burra Naresh

Edited By: Ram Naramaneni

Updated on: Nov 13, 2025 | 5:30 PM

ఏడ వెతికినా సరైన పిల్ల దొరకట్లే.. వయసేమో రోజురోజుకు మోపయితుంది అంటూ ఆందోళన చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో వెలుగుచూసింది. మృతుడిని ఆత్మకూరు మండలం హనకొండకు చెందిన 32 ఏళ్ల బుర్రా నరేష్‌గా గుర్తించారు. మృతుడు అమీర్ పేటలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. నరేష్ తల్లిదండ్రులు బుర్రా సురేందర్, రామ.. 2021 నుంచి తమ కొడుకుకు సరైన సంబంధం కోసం వెతుకుతున్నారు కానీ మ్యాచ్ సెట్ అవ్వట్లే. దీంతో గత కొన్ని రోజులుగా ఈ విషయంపై నరేష్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ విషయాన్ని మిత్రులతో చెప్పుకుని బాధపడేవాడు. అదే విధంగా జుట్టు ఊడిపోవడంపై కూడా అతను ఆందోళన చెందినట్లు సమాచారం. దీంతో నవంబర్ 12న ఘట్‌కేసులో రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వయసు మీద పడిన సమయంలో చేతికొచ్చిన బిడ్డ.. .. ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఈ ఏడాది మే నెలలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఎన్ని మ్యాచెస్ చూసినా పెళ్లి సెట్ కాకపోవడంతో.. నగరానికి చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని పి. ప్రవీణ్ గౌడ్‌గా గుర్తించారు. మృతుడు శంషాబాద్‌లోని పెద్దతుప్రా గ్రామానికి చెందినవాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీ జాబ్ చేసేవాడు. చాలా నెలలుగా, అతని కుటుంబం అమ్మాయి కోసం వెతికారు కానీ సరైన మ్యాచ్ దొరకలేదు. దీంతో మానసిక సంఘర్షణకు లోనై.. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తన జీవితాన్ని ముగించాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.