Telangana: టెన్త్ పరీక్షల్లో మార్పులు.. ఆ ఎగ్జామ్ కోసం రెండు ప్రశ్నాపత్రాలు

|

May 15, 2022 | 8:52 AM

తెలంగాణలో(Telangana) జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణలో అధికారులు కీలక మార్పు చేపట్టారు. కరోనాకు ముందు ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లు ఎగ్జామ్స్ నిర్వహించారు. కానీ కొవిడ్(Corona) విజృంభణతో పరీక్షల...

Telangana: టెన్త్ పరీక్షల్లో మార్పులు.. ఆ ఎగ్జామ్ కోసం రెండు ప్రశ్నాపత్రాలు
Telangana Health department
Follow us on

తెలంగాణలో(Telangana) జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణలో అధికారులు కీలక మార్పు చేపట్టారు. కరోనాకు ముందు ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లు ఎగ్జామ్స్ నిర్వహించారు. కానీ కొవిడ్(Corona) విజృంభణతో పరీక్షల నిర్వహణలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సారి జరిగే పరీక్షల్లో సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నారు. మిగిలిన అయిదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్‌ చొప్పునే ఉంటుంది. ఈ నెల 27న సైన్స్‌ పరీక్ష జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.05 గంటల వరకు భౌతికశాస్త్రం పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంతోపాటు జవాబు పత్రం ఇస్తారు. దాన్ని 11.05 గంటల నుంచి 11.10 గంటల మధ్యలో తీసుకుంటారు. ఆ వెంటనే 11.10 గంటల నుంచి 12.45 గంటల వరకు జీవశాస్త్రం పరీక్ష జరుగుతుంది. ప్రశ్నపత్రంతోపాటు మరో జవాబుపత్రం ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. జవాబుపత్రాలను వేర్వేరు సబ్జెక్టు నిపుణులు, వేర్వేరు మూల్యాంకన కేంద్రాల్లో దిద్దుతారని, అందుకే ఓఎంఆర్‌ పత్రాలు కూడా రెండు ఉంటాయని ఆయన వివరించారు.

మరోవైపు.. తెలంగాణలో ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్, రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థుల కోసం విద్యాశాఖ ఈ షెడ్యూల్ ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇదీ చదవండి

Hyderabad: క్రికెట్ బెట్టింగ్ కు అడ్డాగా ఎల్బీ నగర్.. సీబీఐ దర్యాప్తులో సంచలనాలు