ఫ్యాన్సీ నంబర్ వేలం.. ఆఫీసులో ‘వార్‌ సీన్’

తమ కార్లు, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్‌ల కోసం పోటీపడుతుంటారు చాలామంది. అందుకోసం ఎంత చెల్లించడానికైనా వారు వెనకాడరు. కాగా ఇటీవల ఖైరతాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన నంబర్ల వేలంలో ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌జోన్‌లో రవాణాశాఖ నంబర్ల వేలం నిర్వహించింది. అందులో‘టీఎస్09 ఎఫ్ఎఫ్‌’తో కొత్త సిరీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఎంతో డిమాండ్ ఉన్న 0001 కోసం ఘర్షణ జరిగింది. సాధారణంగా ఫ్యాన్సీ […]

ఫ్యాన్సీ నంబర్ వేలం.. ఆఫీసులో ‘వార్‌ సీన్’

Edited By:

Updated on: Apr 16, 2019 | 2:12 PM

తమ కార్లు, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్‌ల కోసం పోటీపడుతుంటారు చాలామంది. అందుకోసం ఎంత చెల్లించడానికైనా వారు వెనకాడరు. కాగా ఇటీవల ఖైరతాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన నంబర్ల వేలంలో ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

సోమవారం ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌జోన్‌లో రవాణాశాఖ నంబర్ల వేలం నిర్వహించింది. అందులో‘టీఎస్09 ఎఫ్ఎఫ్‌’తో కొత్త సిరీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఎంతో డిమాండ్ ఉన్న 0001 కోసం ఘర్షణ జరిగింది. సాధారణంగా ఫ్యాన్సీ నంబర్‌ను కోరుకున్న వారు దాని కోసం అధికారులు నిర్ణయించిన కనీస ధరతో పాటు అదనంగా వారికి ఇష్టమైన మొత్తాన్ని చెక్కుల రూపంలో టెండర్ బాక్స్‌లో వేయాలి. ఇందులో భాగంగా నిర్ణీత సమయంలో నలుగురు టెండర్ వేశారు. అయితే సమయం ముగిశాక టెండర్ బాక్స్‌లోని కవర్లు తీసుకెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి తన కవరును అందులో వేసే ప్రయత్నం చేశాడు. దీనిపై మరో వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తరువాత ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. కాగా ఈ నంబర్‌ను ఎఫ్ఆర్ఆర్ హిల్ హోటల్స్ రూ.6.95లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. మొత్తానికి సోమవారం జరిగిన వేలంతో ఖైరతాబాద్ ఆర్టీవో సంస్థకు రూ.30,55,748లక్షల రాబడి లభించింది.