TV9 Sweet Home Expo: మీ సొంతింటి కల నెరవేరేందుకు అద్భుతమైన వేదిక టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో

|

Dec 11, 2023 | 9:16 PM

TV9 Sweet Home Real Estate and Interiors Expo:  2023 డిసెంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లో TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో కొనసాగనుంది. ఇది హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో. ఇందులో రియల్ ఎస్టేట్ కు సంబంధించి మీకున్న అన్ని అనుమానాలను క్లియర్‌ చేసుకోవచ్చు. అలాగే వివిధ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు..

TV9 Sweet Home Expo: మీ సొంతింటి కల నెరవేరేందుకు అద్భుతమైన వేదిక టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో
Tv9 Sweet Home Real Estate And Interiors Expo
Follow us on

TV9 Sweet Home Real Estate and Interiors Expo: సంపాదించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేయాలని భావిస్తుంటారు. దీంతో డబ్బును వివిధ రంగాల్లో ఇన్వెస్టమెంట్లు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో రియల్‌ ఎస్టేట్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్ట పోయిన సందర్భాలు లేవని చెబుతుంటారు. అందుకే మీ వద్ద డబ్బు ఉంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. ఇల్లు, స్థలం, అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌.. ఇలా ఏదోఒకదానిలో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అయితే చాలా మంది డబ్బు ఉంటుంది. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..? ఎలాంటి మార్గాల్లో పెట్టాలి? ఇలాంటి సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు Tv9 తెలుగు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

2023 డిసెంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లో TV9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో. ఇందులో రియల్ ఎస్టేట్ కు సంబంధించి మీకున్న అన్ని అనుమానాలను క్లియర్‌ చేసుకోవచ్చు. అలాగే వివిధ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇందులో అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్‌లు, రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాపర్టీలు ఈ ఎక్స్‌పోలో తెలుసుకునే అవకాశం దక్కించుకోవచ్చు.

అలాగే మీరు పెట్టే పెట్టుబడులను సైతం ఎంపిక చేసుకోవచ్చు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో స్థలం కొనుగోలు చేయడం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు కస్టమర్లకు వివిధ దశల్లో అవసరమయ్యే అన్ని రకాల సేవలకు సంబంధించిన కంపెనీల సమాచారాన్ని ఈ టీవీ9 స్వీట్‌ హోమ్‌ ఎక్స్‌పో ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “మైదాన్ ఎక్స్‌పో సెంటర్” (Meydan Expo Center)లో కొనసాగనున్న ఎక్స్‌పో.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.

దిగ్గజ డెవలపర్‌లు పాల్గొనే ఈ ఎక్స్‌పోలో అన్ని వర్గాల ప్రజలకు అనువైన బడ్జెట్‌లో హౌసింగ్ ఆప్షన్‌లను అందుబాటులో ఉంచనుంది. ఫర్నీచర్, ఇంటిరీయర్ డిజైనింగ్, వాటర్ ఫౌంటెన్, వాల్ ఆర్ట్ డెకరేషన్, ఇంకా మరెన్నో గృహలంకరణ డిజైన్లు, వస్తువుల గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాల వివరాలు, అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించే బ్యాంకుల గురించి అవసరమైన సమాచారం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి