KTR: తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది డబ్బులను పుట్నాలు, బఠానీల్లాగా పంచేందుకు కాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో బుధవారం దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడలో కేరీర్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దళిత బంధు పథకం అసలు ఉద్దేశమేంటో తెలిపారు. దళిత బంధును పుట్నాలు, బఠాణీల మాదిరిగా పంచేందుకు తీసుకురాలేదని, సంపద పునరుత్పత్తి కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారు. అమెరికా నుంచి తెలంగాణ వరకు ఎవరు పాలిస్తున్నా వారి ముందున్న అతి పెద్ద సవాల్.. ఉపాధి కల్పన, నిరుద్యోగం. ప్రతీఏటా లక్షల మంది విద్యావంతులు బయటకు వస్తున్నారు. వారి అర్హతలకు తగ్గ ఉపాధి కల్పిండం ప్రభుత్వాలకు పెద్ద సవాల్. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పన పరిమతంగానే ఉంటుంది. అందుకే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలి, పారిశ్రామికవేత్తలుగా మారాలి. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను రూపొందించింది. పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నాము’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Minister @KTRTRS inaugurated the Dalit Indian Chamber of Commerce and Industry (@DICCIorg) Business Facilitation Centre & Model Career Centre in Hyd. IT Dept Prl Secy @jayesh_ranjan, DICCI Founder Chairman Dr. Milind Kamble, National President Narra RaviKumar graced the occasion pic.twitter.com/Vccgx8Dk7W
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 20, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..