Surabhi Vani Devi CM KCR : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఎంఎల్సీగా పోటీ చేసిన సురభి వాణీ దేవి, తన గెలుపు అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను, శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, అన్నీతానై తన గెలుపునకు కారణమైన సీఎం కేసీఆర్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వాణీదేవిని సీఎం కేసీఆర్ అభినందించారు. శాలువాతో సత్కరించారు. వాణిదేవికి విజయాన్ని కట్టబెట్టిన అన్నివర్గాల పట్టభద్రులకు కేసీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వాణీదేవి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ముఖ్యమంత్రి అభినందించారు.
రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, కె.పి.వివేకానంద, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మందాజగన్నాధం, తదితరులు ప్రగతి భవన్లో వాణీదేవికి అభినందనలు తెలిపారు.