Hyderabad: ఈ ఏటీఎమ్‌లో డబ్బులేస్తే సంచులొస్తాయి.. హైదరాబాదీ సంస్థ వినూత్న ఆవిష్కరణ.

|

Apr 11, 2023 | 7:19 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్ట పీడిస్తోన్న సమస్యల్లో ప్లాస్టిక్‌ భూతం ఒకటి. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ప్లాస్టిక్‌ వినియోగం మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో విపరీతంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి చెక్‌ పెట్టడానికే...

Hyderabad: ఈ ఏటీఎమ్‌లో డబ్బులేస్తే సంచులొస్తాయి.. హైదరాబాదీ సంస్థ వినూత్న ఆవిష్కరణ.
Atb
Follow us on

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్ట పీడిస్తోన్న సమస్యల్లో ప్లాస్టిక్‌ భూతం ఒకటి. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ప్లాస్టిక్‌ వినియోగం మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో విపరీతంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి చెక్‌ పెట్టడానికే క్లాత్‌తో చేసిన సంచులను ఉపయోగించాలని అవగాహన కల్పిస్తున్నారు. అయితే అన్ని చోట్ల ఇవి లభించడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా జీహెచ్‌ఎంసీ సరికొత్త మిషిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాధారణంగా మనం ఉపయోగించే ఏటీఎమ్‌లు డబ్బులను ఇస్తే.. మీరు చూస్తున్న ఈ మిషన్‌ మాత్రం సంచులను ఇస్తుంది. ఏటీబీ (ఏనీ టైమ్‌ బ్యాగ్‌) పేరుతో మెవాటే, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ ఈ మిషన్‌ను ఏర్పాటు చేసింది. రూ. 10 చెల్లిస్తే సంచులను పొందొచ్చు. ఇందుకోసం మనం రూ. 10 నోటు లేదా రెండు ఐదు రూపాయలను బిల్లలను మిషన్‌లో వేసిన వెంటనే.. కింది నుంచి సంచి వస్తుంది. అంతేకాదండోయ్‌.. మిషన్‌పై ఉండే క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి యూపీఐ ద్వారా పేమెంట్‌ చేసి కూడా సంచిని తీసుకోవచ్చు. 500 సంచుల పట్టే సామర్థ్యం ఈ మిషన్‌ సొంతం.

ఇదిలా ఉంటే ఈ మిషన్‌ పనిచేయడానికి కరెంట్‌ కూడా అవసరం లేదు. సోలార్‌ ఎనర్జీ ద్వారానే పని చేస్తుంది. కూకట్‌పల్లిలోని ఐడీపీఎల్‌ ప్రాంతంలో శనివారం ఈ మిషన్‌ను ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ మిషిన్లను నగరమంతా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఈ ఏటీబీ మిషన్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.. అద్భుతమైన ఆవిష్కరణ అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..