Ugadi 2021: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు.. పంచాంగ శ్రవణం వినిపిస్తున్న వేద పండితులు

|

Apr 13, 2021 | 11:00 AM

Ugadi 2021: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలంగాణ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లోని..

Ugadi 2021: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు.. పంచాంగ శ్రవణం వినిపిస్తున్న వేద పండితులు
Ugadi 2021
Follow us on

Ugadi 2021: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు తెలంగాణ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో కమిషనర్ అనిల్ కుమార్ సారథ్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు. ఉదయం 10.45 గంటల నుంచి పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శ్రీ ప్లవ నామ సంవత్సరం నూతన పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. కాగా, అంతకుముందు ఈ వేడుకలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఇదిలాఉంటే కరోనా వ్యాప్తి రాష్ట్రంలో అధికంగా ఉండటంతో ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు కేవలం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి సహా ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు.

Ugadi Celebrations Live: