Challan Payment: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ అందించిన విషయం ఇప్పటికే తెలిసిందే. రేపటి నుంచే ఈ అవకాశాన్ని అందిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఈ అవకాశం మార్చి 1 నుంచి మార్చి 30 వరకు తెలంగాణ వ్యాప్తంగా రాయితీలతో(Discount) పెండింగ్ చలానాల(Pending Challans) ‘ఈ-లోక్ అదాలత్’ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం వెబ్‌సైట్https://echallan.tspolice.gov.in/publicview లోనే వాహనదారులు తమ పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేందుకు అవకాశం కూడా అందించినట్లు ఆయన పేర్కొన్నారు. పేటీంఏం, గూగుల్ పే వంటి యాప్స్‌ను ఉపయోగించి కూడా పెండింగ్ చలాన్‌లను క్లియర్ చేసుకోవచ్చని తెలిపారు.
వాహణదారులందరూ కోవిడ్ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో లోకదాలత్ ద్వారా ఈ రాయితీ కేటాయించామని ఆయన ప్రకటించారు. కోవిడ్ మాస్క్ కేసుల్లో రూ.1000లకు గాను కేవలం రూ. 100లు మాత్రం కడితే సరిపోతుందని పేర్కొన్నారు. పేదవర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. ప్రతీ చలాన్‌ను మీ సేవా, ఆన్లైన్ ద్వారా, తెలంగాణ ఈ చలాన్ ద్వారా పే చేయవచ్చని తెలపారు. ఈ అవకాశం నెల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రాఫిక్ చలాన్ కట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు 25 శాతం రాయితీ అందిస్తోన్న ప్రకటించారు. హైదరాబాద్ లోనే కేవలం రూ. 500 కోట్ల చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
Also Read: Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం..!