ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఒక మృతదేహం వెలికితీత

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ చివరి దశకు చేరుకుంది. 16 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా.. తాజాగా టన్నెల్‌ ఎండ్‌పాయింట్‌లో గుర్తించిన రెండు చోట్ల ర్యాట్‌ హోల్‌ మైనర్లు తవ్వకాలు జరుపుతున్నారు. కేరళ కెడావర్‌ డాగ్స్‌ కొన్ని ప్రాంతాలను గుర్తించగా.. ఆయా ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టారు. తాజాగా ఓ మృతదేహం లభ్యమైంది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఒక మృతదేహం వెలికితీత
Srisailam Left Bank Canal

Updated on: Mar 09, 2025 | 7:23 PM

SLBC టన్నెల్‌ నుంచి మృతదేహం వెలికితీసి.. బయటకు తీసుకువచ్చింది రెస్క్యూ టీమ్.  మృతుడు TBM ఆపరేటర్‌ గురుప్రీత్‌సింగ్‌గా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన స్పాట్‌లో తవ్వకాలు కొనసాగుతున్నాయి.

SLBC టన్నెల్‌లో 16 రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. టన్నెల్‌ ఎండ్‌పాయింట్‌లో కేరళ కెడావర్‌ డాగ్స్‌ రెండు ప్రదేశాలను గుర్తించాయి. దాంతో.. ఆయా ప్రదేశాల్లో ర్యాట్‌ హోల్‌ మైనర్లు తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలు పూర్తికావస్తుండడంతో కార్మికుల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా ఏడుగురికి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇక.. SLBC టన్నెల్‌లో భారీగా పేరుకుపోయిన బురదను తొలగించేందుకు రెండు మినీ జేసీబీలను వినియోగిస్తున్నారు. టీబీఎం మెషీన్ శకలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు. కన్వేయర్‌ బెల్ట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో.. దాని ద్వారా శిథిలాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..