
రాజకీయంగా బయట భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు గానీ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మాత్రం ఒకే మాట వినిపించింది, ఒకే బాట కనిపించింది. ఐటీ, ఏఐ, క్వాంటం రంగాల్లో హైదరాబాద్ పక్క రాష్ట్రాలతోనే పోటీపడుతోంది. ఒకవిధంగా బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది హైదరాబాద్. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలంటే.. దాదాపుగా పెట్టుబడుల్లో మెజారిటీ శాతం రాష్ట్రానికే రావాలి. అంటే అర్ధం.. పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన కంపెనీలను కూడా ఆకర్షించాల్సి ఉంటుంది. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎలాంటి మెరుగైన అవకాశాలు ఉన్నాయో ఓ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడమే ఈ గ్లోబల్ సమిట్. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఎందుకు బెటర్ అనేది చెబుతోంది. అలాంటి సమిట్‌కు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం వచ్చారు. చాలా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు కూడా. హైదరాబాద్, బెంగళూరు కాంపిటీటర్స్ అనేది బయట జరిగే ఓ డిస్కషన్ పాయింట్. ఎవరెక్కువ ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు, ఎవరెన్ని పెట్టుబడులు ఆకర్షిస్తారు అనే దానిపై ఓ పోటీ ఉంటుంది. కాని, డీకే శివకుమార్ మాత్రం తాము కాంపిటీటర్స్ కాదు.. ఒకరికొకరం సపోర్టర్స్ అన్నారు. తమకు ప్రపంచంతోనే పోటీ తప్ప రాష్ట్రాల మధ్య పోటీ కాదనే క్లారిటీ ఇచ్చారు. ఇండియాలో టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ ఏవని అడిగితే హైదరాబాద్, బెంగళూరునే చూపిస్తారంటూనే.. దేశ ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు వాటా 40 శాతం ఉంన్నారు. కాలిఫోర్నియా...