Hyderabad: డ్రైవింగ్‌ చేస్తుండగానే.. గుండెపోటుతో కుప్పకూలిన క్యాబ్‌ డ్రైవర్‌

|

Mar 31, 2023 | 11:22 AM

డ్రైవింగ్‌ చేస్తుండగా క్యాబ్‌ డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఓ పోలీసధికారి అప్రమత్తమై సీపీఆర్‌ చేసి, బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే అతని ప్రాణాలు పోయాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో..

Hyderabad: డ్రైవింగ్‌ చేస్తుండగానే.. గుండెపోటుతో కుప్పకూలిన క్యాబ్‌ డ్రైవర్‌
Cab Driver Died Of Heart Attack
Follow us on

డ్రైవింగ్‌ చేస్తుండగా క్యాబ్‌ డ్రైవర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఓ పోలీసధికారి అప్రమత్తమై సీపీఆర్‌ చేసి, బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అంతలోనే అతని ప్రాణాలు పోయాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో గురువారం (మార్చి 30) ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మలక్‌పేట్‌ ధోబీగల్లీకి చెందిన కావలి శ్రీనివాస్‌ (40) భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలతో జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చాడు. హయత్‌నగర్‌లోని ఓ ఇంట్లో కుటుంబంతో అద్దెకుంటూ క్యాబ్‌ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మార్చి 30 సాయంత్రం 5 గంటలకు క్యాబ్‌లో ప్రయాణికులను యాదగిరిగుట్టకు తీసుకెళ్తున్నాడు. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ దాటగానే డ్రైవర్‌ శ్రీనివాస్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కారు నడుపుతుండగానే సృహతప్పి పడిపోయాడు.

వెంటనే వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికురాలు అప్రమత్తమె ముందుకు వంగి స్టీరింగ్‌ నియంత్రించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అటుగావెళ్తున్న రామన్నపేట సీఐ మోతీరామ్ గమనించి మరో వ్యక్తి సాయంతో కారుకు బ్రేక్‌ వేసి డ్రైవర్‌ శ్రీనివాస్‌ను బయటకు తీశాడు. సీపీఆర్‌ చేయగా బాధితుడు స్పృహలోకి వచ్చాడు. సీఐ తన వాహనంలోనే హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా గతకొంతకాలంగా సడెన్‌ హార్ట్‌స్ట్రోక్‌లతో పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు మృతి చెందుతున్న విషయం విథితమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.