మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ!

| Edited By:

Aug 14, 2019 | 6:44 PM

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వార్డుల విభజన ఏవిధంగా చేపట్టారో వివరించాలని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ గడువును ఎందుకు తగ్గించారో చెప్పాలని అడిగింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి చట్టప్రకారమే వ్యవహరించామని, వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే రాజకీయ కోణంలోనే ఈ ప్రక్రియ చేపట్టారని, ముఖ్యంగా వార్డుల విభజన గందరగోళంగా జరిగిందని పిటిషన్‌ […]

మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో విచారణ!
Follow us on

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వార్డుల విభజన ఏవిధంగా చేపట్టారో వివరించాలని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ గడువును ఎందుకు తగ్గించారో చెప్పాలని అడిగింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి చట్టప్రకారమే వ్యవహరించామని, వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే రాజకీయ కోణంలోనే ఈ ప్రక్రియ చేపట్టారని, ముఖ్యంగా వార్డుల విభజన గందరగోళంగా జరిగిందని పిటిషన్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వార్డుల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలపాలని పేర్కొంది. కొత్త చట్టానికి, పాత చట్టానికి మధ్య తేడా ఏంటీ.. కొత్త చట్టంలో ఏముందో తెలుసుకోవడానికి తమకు ఆ కొత్త చట్టాన్ని పూర్తి వివరాలతో సమర్పించాలని ఆదేశించింది. ఎల్లుండి మరోసారి దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.