అబ్బ.. కూల్ న్యూస్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు..

తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటిపూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలు, నైరుతి రుతుపవనాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది..

అబ్బ.. కూల్ న్యూస్.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు..
Rain Alert

Edited By:

Updated on: May 14, 2025 | 5:42 PM

తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటిపూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సాయంత్రం వేళల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలు, నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. తూర్పు బీహార్ మరియు దాని పరిసరాల్లోని సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుండి ఝార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది.

రాగల మూడు నాలుగు రోజులలో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు దక్షిణ బంగాళాఖాతం లోని మరిన్ని ప్రాంతాలు, పూర్తి అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో పాటు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలంగాణ లోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది.. దీంతో
వాతావరణ శాఖ అధికారులు 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

రాగల రెండు మూడు రోజులు కూడా తెలంగాణలో పగటి పూట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవగా మే నెల వచ్చే సరికి మాత్రం ఉష్ణోగ్రతలు కొంతం తక్కువగానే నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో పాటు రుతుపవనాలు కూడా కొంత ముందుగానే కేరళ తీరాన్ని తాకుతుండడంతో వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..