Nampally Exhibition: ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్‌గా హరీశ్.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పిద్దామని ప్రకటన

|

Aug 21, 2021 | 9:34 PM

హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌గా మంత్రి హరీశ్‌రావు ఎన్నికయ్యారు. సొసైటీ మేనేజ్‌మెంట్‌ విజ్ఞప్తి మేరకు

Nampally Exhibition: ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్‌గా హరీశ్.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పిద్దామని ప్రకటన
Harish Rao
Follow us on

Nampally Exhibition – NAMAYUSH:హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌గా మంత్రి హరీశ్‌రావు ఎన్నికయ్యారు. సొసైటీ మేనేజ్‌మెంట్‌ విజ్ఞప్తి మేరకు అధ్యక్షుడిగా ఉండేందుకు ముందుకొచ్చారు మంత్రి హరీశ్‌రావు. ఈ మేరకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్‌రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్.. ఎగ్జిబిషన్‌ సొసైటీని మరింత అభివృద్ధిపరుస్తానన్నారు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని మంత్రి చెప్పారు. ప్రతిష్ఠాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం, ఉపాధి అవకాశాలు కల్పిద్దామన్నారు.

గత 80 ఏళ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించడం ఒక అద్భుతమని హరీశ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామన్నారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, వారిలో వృత్తి నైపుణ్యం మెరుగుపర్చి ఉపాధి అవకాశాలు పొందేలా తీర్చిదిద్దుదామన్నారు.

Read also: Avanthi Srinivas: సోదరి ద్వారా మనసా, వాచా, కర్మణా, పవిత్రంగా, సత్సంగ జీవిత రూపకల్పనే రాఖీ పండుగ ప్రత్యేకత: మంత్రి అవంతి