High Court on Hydra: ఆదివారం కూల్చివేతలేంటి..? చంచల్‌గూడ, చర్లపల్లికు పంపిస్తే తెలుస్తుంది.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

|

Sep 30, 2024 | 3:16 PM

హైదరాబాద్‌ నగరంలో ఓ వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లకు మార్కింగ్ ప్రక్రియ తెలంగాణను షేక్ చేస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రాకున్న చట్టబద్ధతను ధర్మాసనం ప్రశ్నించింది.

High Court on Hydra: ఆదివారం కూల్చివేతలేంటి..? చంచల్‌గూడ, చర్లపల్లికు పంపిస్తే తెలుస్తుంది.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
Telangana High Court
Follow us on

హైదరాబాద్‌ నగరంలో ఓ వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్లకు మార్కింగ్ ప్రక్రియ తెలంగాణను షేక్ చేస్తున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రాకున్న చట్టబద్ధతను ధర్మాసనం ప్రశ్నించింది. పొలిటికల్‌ బాసుల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని హైకోర్టు అధికారులను హెచ్చరించింది. ఈ సందర్భంగా ఆదివారం కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.. రాజకీయ నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని.. చంచల్ గూడ, చర్లపల్లికు పంపిస్తే తెలుస్తుందంటూ హై కోర్ట్ పేర్కొంది.

ఇష్టానుసారంగా భవనాలను కూల్చేస్తే జీవో99పై స్టే ఇస్తామంటూ న్యాయస్థానం పేర్కొంది.. ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దన్న హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్‌, అమీన్‌పూర్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కూల్చివేతలపై సోమవారం విచారణ జరిపింది.. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు.. విచారణ అనంతరం హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేసింది.

వీడియో చూడండి..

వర్చువల్‌గా విచారణకు హాజరైన హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. తహశీల్దార్‌ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ సీరియస్‌ అయ్యింది. ఆదివారం కూల్చివేతలపై మండిపడిన ధర్మాసనం.. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ పేర్కొంది. వీకెండ్‌లోనే కూల్చివేతలు ఎందుకని హైకోర్టు ప్రశ్నించగా.. అమీన్‌పూర్‌లో కేవలం పరికరాలు మాత్రమే సమకూర్చామని హైడ్రా కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఆదివారం ఎలా పరికరాలు సమకూరుస్తారు.. ఆదివారం కూల్చడంలో మీ ఉద్దేశం ఏమిటంటూ ధర్మాసనం ప్రశ్నించింది.. రేపు చార్మినార్ తహశీల్దార్‌ వచ్చి.. చార్మినార్, హైకోర్టును కూల్చడానికి పరికరాలు అడుగుతారు… కూల్చేస్తారా..? అంటూ రంగనాథ్‌ను ప్రశ్నించింది..

హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు చేయడమేనా.. ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దంటూ హైకోర్టు సూచించింది.. పెద్దలు, పేదల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా..? మూసీ విషయంలో యాక్షన్‌ ప్లాన్ ఏమిటి..? అంటూ ప్రశ్నించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..