తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ ఫలితాల విచారణ మళ్లీ వాయిదా పడింది. పున: పరిశీలన ఫలితాలను జవాబు పత్రాలతో సహా వెల్లడించామన్న ఇంటర్ బోర్డు.. అందుకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్డుకు సమర్పించింది. అయితే ఇంకా పున: పరిశీలన ప్రక్రియ పూర్తి చేయలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది తన వాదనను కోర్టును వినిపించారు. దీనిపై అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలపాలన్న హైకోర్టు.. తరుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.