ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

| Edited By: Pardhasaradhi Peri

Dec 15, 2019 | 10:53 AM

షాద్‌ నగర్‌లో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార నిందితులు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఎంతోమంది హర్షం వ్యక్తం చేశారు. దిశ ఆత్మకు తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారంటూ పలువురు హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకించిన వారూ లేకపోలేదు. మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలతో పాటు మరికొందరు ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టారు. ఇక న్యాయం, ప్రతీకారం కాకూడదు అంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ […]

ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow us on

షాద్‌ నగర్‌లో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార నిందితులు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఎంతోమంది హర్షం వ్యక్తం చేశారు. దిశ ఆత్మకు తెలంగాణ పోలీసులు సరైన న్యాయం చేశారంటూ పలువురు హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకించిన వారూ లేకపోలేదు. మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలతో పాటు మరికొందరు ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టారు. ఇక న్యాయం, ప్రతీకారం కాకూడదు అంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డే కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే ఈ ఎన్‌కౌంటర్‌పై తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. అత్యాచారాలకు ఉరి శిక్ష వేయడం, కాల్చి చంపడం అన్నది శాశ్వత పరిష్కారం కాదని అన్నారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మొదట సమాజంలో మార్పు రావాలని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆ తరువాత మానవ వికాస వేదిక మహా సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరుగుతున్న దారుణాలతో చాలా మంది తల్లిదండ్రుల్లో భయం పట్టుకుందని.. పిల్లల భవిష్యత్తుపై వారు ఆందోళన చెందుతున్నారని ఈటెల తెలిపారు. బయటకు వెళ్లిన పిల్లలు తిరిగి వస్తారో లేదో అని భయపడుతున్నారని ఆయన అన్నారు. ఆడ బిడ్డలకు సొంత ఇంట్లోనే రక్షణ కరువైందని, పిల్లలపైన కొంత మంది తండ్రులే క్రూర మృగాలుగా ప్రవర్తిస్తున్నారని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. నాగరికత ప్రపంచంలో మానవ సంబంధాలు నాశనం అయ్యాయని… టెక్నాలజీ పెరిగినా, సమాజంలో అసాంఘిక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మనిషి బాగు పడటం కోసం ఉపయోగపడాలి కానీ.. ఇప్పుడు అవే మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాయని ఈటెల అన్నారు. మనిషి సృష్టిస్తున్న టెక్నాలజీనే అతడిని నాశనం చేస్తోందని ఈటెల అన్నారు.