సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ!

| Edited By:

Jul 17, 2019 | 6:53 PM

ఎర్రమంజిల్, సచివాలయం కూల్చివేతలపై హైకోర్టు నేడు విచారించింది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదని ఏడీజీ స్పష్టం చేసింది. కూల్చివేతలపై ప్రభుత్వం చట్టబద్ధంగానే నిర్ణయాలు తీసుకుందని, నిపుణుల సిఫారసు మేరకే కొత్త భవనాల నిర్మాణం చేపడతారని ఏడీజీ తెలిపింది. ఎర్రమంజిల్ పురాతన భవనం కాదని… హెరిటేజ్ జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని ప్రభుత్వం పేర్కొంది. చారిత్రక కట్టడాల కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేస్తామని […]

సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో విచారణ!
Follow us on

ఎర్రమంజిల్, సచివాలయం కూల్చివేతలపై హైకోర్టు నేడు విచారించింది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వ పాలసీ విధానాలపై ప్రశ్నించే హక్కు పిటిషనర్లకు లేదని ఏడీజీ స్పష్టం చేసింది. కూల్చివేతలపై ప్రభుత్వం చట్టబద్ధంగానే నిర్ణయాలు తీసుకుందని, నిపుణుల సిఫారసు మేరకే కొత్త భవనాల నిర్మాణం చేపడతారని ఏడీజీ తెలిపింది. ఎర్రమంజిల్ పురాతన భవనం కాదని… హెరిటేజ్ జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని ప్రభుత్వం పేర్కొంది. చారిత్రక కట్టడాల కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేస్తామని ఏడీజీ స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

కాగా… పిటిషనర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్ నిర్ణయాధికారం ఉంటుందని తెలిపారు.చారిత్రక ,వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్ళు దాటితే వాటిని కూల్చడానికి వీల్లేదని కోర్టుకు వెల్లడించారు.100 ఏళ్ళు దాటిన కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించాలని కోరారు.