Governor Tamilisai: ఢిల్లీకి గవర్నర్​తమిళిసై.. మంగళవారం అమిత్ ​షాతో భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ..

|

Apr 04, 2022 | 7:32 PM

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈరోజు (సోమవారం) రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గవర్నర్ తమిళిసై హోం శాఖకు..

Governor Tamilisai: ఢిల్లీకి గవర్నర్​తమిళిసై.. మంగళవారం అమిత్ ​షాతో భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ..
Telangana Governor Tamilisa
Follow us on

తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ఈరోజు (సోమవారం) రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గవర్నర్ తమిళిసై హోం శాఖకు ఇచ్చే రిపోర్ట్ కీలకంగా మారబోతుంది. గవర్నర్ రిపోర్ట్ ఇవ్వడం సాధారణమే అయినా.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గవర్నర్ ఢిల్లీ టూర్ కీలకంగా మారింది. తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా వచ్చాక గవర్నర్, గవర్నమెంట్‌ మధ్య సఖ్యత ఉండేది. అయితే ఈ మధ్య వచ్చిన గ్యాప్‌ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గవర్నర్ అధికారిక కార్యక్రమాలకు సీఎం హాజరుకాకపోవడం గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, ప్రొటోకాల్ వివాదాలను గవర్నర్‌ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నారన్న క్రమంలో గవర్నర్ ఇచ్చే రిపోర్ట్ కీలకం కాబోతుందని తెలుస్తోంది.

రాజ్​భవన్​లో జరిగిన ఉగాది ఉత్సవాలను గవర్నర్​ నిర్వహించారు. ఆ సంబురాలకు కేసీఆర్​కు గవర్నర్​ ఆహ్వానం పలికింది. అయితే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. శనివారం నాడు గవర్నర్​ తమిళిసై కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం అక్కడి మంత్రులు, ఎమ్మెల్యే సహా ఆఖరికి ఆలయ ఈవో కూడా హాజరుకాలేదు.

రాష్ట్రంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన గవర్నర్​కు మంత్రులు స్వాగతం పలకలేదు. అక్కడ కూడా ప్రోటోకాల్​ పాటించలేదు. ఈ ఏడాదిలో జరిగిన గణతంత్ర వేడుకలకు సైతం సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ రాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్​ సమావేశాలు నిర్వహించారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళి సై ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి: Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..

Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..