ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతికి గవర్నర్ తమిళిసై దంపతులు శక్రవారం తొలి పూజ నిర్వహించారు. గణపయ్యకు బంగారు కంకణాన్ని గవర్నర్ సమర్పించారు. అనంతరం గవర్నర్‌ను కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. స్వామివారికి 60 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు.
ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 40 అడుగుల హైదరాబాద్ గణేష్‌కు కుడిమైపున కాల నాగేశ్వరీ, ఎడమవైపు కృష్ణకాళీ అమ్మవారు ఉన్నారు. చవితిని పురస్కరించుకుని మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
గణేష్ ఉత్సవాల దృష్ట్యా ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో రావాలని సూచించారు. HMDA పార్కింగ్ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతినిచ్చారు. వృద్ధులు, నడవలేని వారికి మింట్ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో ఈనెల 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..
Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..