Omicron Variant: ఓమిక్రాన్‌ వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ ఫుల్ ఫోకస్.. సబ్ కమిటీ నియామకం..

|

Nov 29, 2021 | 5:58 PM

ఓమిక్రాన్ వేరియంట్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల...

Omicron Variant: ఓమిక్రాన్‌ వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ ఫుల్ ఫోకస్.. సబ్ కమిటీ నియామకం..
Kcr2
Follow us on

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌పై తెలంగాణ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం కేసీఆర్ వైద్యారోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా కొత్త వేరియంట్‌ను ఎదుర్కునేందుకు వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

ఈ నేపధ్యంలో ఓమిక్రాన్ వేరియంట్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం క్యాబినెట్ సబ్ కమిటీని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ సబ్ కమిటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌లు సభ్యులుగా ఉంటారు.