జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. హేమంత్ సోరేన్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేఎంఎం నేతృత్వంలోని 39 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి హైదరాబాద్ బయల్దేరి వచ్చారు. బేగంపేటకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలంతా శామీర్‌పేటలోని రిసార్ట్‌కు వెళ్లారు. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది.. అప్పటివరకు ఇక్కడే ఉండనున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎంకు 29, బీజేపీకి -26, కాంగ్రెస్‌కు -17, AJSUకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులతో పాటు సీపీఐ, ఎన్సీపీ, ఆర్జేడీలకు ఒక్కో సభ్యుడి బలం ఉంది. 81మంది సభ్యుల అసెంబ్లీలో.. జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తమ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీ గాలెం వేసే అవకాశం ఉండటంతో కూటమి అప్రమత్తమైంది. దీంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు షిప్ట్ చేసింది.
జార్ఖండ్ నుండి హైద్రాబాద్ శామీర్ పేట్ చేరుకున్న జేఏంఏం సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలు 37 మంది లియోనియ రీస్టార్ట్ లో మకాం వేశారు. వీరి పర్యవేక్షణ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకున్నారు. ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒక అబ్జర్వర్ తో పర్యవేక్షిస్తున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మున్షి.. తెలంగాణ నేతలకు అప్పగించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్.. నిఘాతో ఎమ్మెల్యేల బాధ్యతలను చూసుకుంటోంది. కాగా.. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలొ బల నిరూపణ వరకు రిసార్ట్ లోనే ఎమ్మెల్యేలు ఉండనున్నారు. ఆ తర్వాత జార్ఖండ్ కు వెళ్లనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..