నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభించిన కేసీఆర్

| Edited By:

Jun 17, 2019 | 3:38 PM

హైదర్‌గూడలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు మహమ్మద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మొత్తం 4.26 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ఈ క్వార్టర్స్‌ను నిర్మించారు. ఈ క్వార్టర్స్‌లో మొత్తం 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో […]

నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభించిన కేసీఆర్
Follow us on

హైదర్‌గూడలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు మహమ్మద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కాగా మొత్తం 4.26 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ఈ క్వార్టర్స్‌ను నిర్మించారు. ఈ క్వార్టర్స్‌లో మొత్తం 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలంగా నిర్మించారు. మాస్టర్‌ బెడ్‌రూమ్, గెస్ట్ బెడ్‌రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, లివింగ్ హాల్, రీడింగ్ రూమ్, విశాలమైన బాల్కనీ ఉన్నాయి. వీటితో పాటు 36 స్టాఫ్ క్వార్టర్స్, 120 అటెండర్ క్వార్టర్స్‌ ఇదే ప్రాంగణంలో నిర్మించారు. 166 కోట్ల వ్యయంతో ఈ క్వార్టర్స్‌ను నిర్మించారు. ఒక భవనంలో 12 అంతస్తులు ఉన్నాయి. ఒక్కో అంతస్తులో పది ఫ్లాట్స్‌ ఉన్నాయి. 276 కార్లను ఒకేసారి పార్క్ చేసే అవకాశముంది. విజిటర్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో భద్రతను పర్యవేక్షిస్తారు.