Hyderabad: వారెవ్వా.. హోంగార్డ్ డెడికేషన్‌కు చీఫ్‌ జస్టిస్‌ ఫిదా.. కారు దిగి వచ్చి అభినందన

అబిడ్స్‌ పీఎస్‌ పరిధిలో పనిచేసే అష్రఫ్ అలీ అనే హోంగార్డు విధుల పట్ల చూపించే అకింత భావానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఫిదా అయిపోయారు. కారు దిగి మరీ ప్రశంసించారు.

Hyderabad: వారెవ్వా.. హోంగార్డ్ డెడికేషన్‌కు చీఫ్‌ జస్టిస్‌ ఫిదా.. కారు దిగి వచ్చి అభినందన
Chief Justice Satish Chandra Sharma
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 08, 2022 | 12:36 PM

ఆయన, తెలంగాణ హైకోర్టు(Telangana High Court ) చీఫ్‌ జస్టిస్‌, పేరు సతీష్‌ చంద్ర. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అయిన ఆయనను ఓ అతి సాధారణ ఉద్యోగి ఆకట్టుకున్నాడు. తన అంకితభావం, పనితీరుతో స్టేట్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌నే ఆకర్షించాడు. అష్రఫ్‌ అలీ( Homeguard Ashraf Ali ), పోలీస్ శాఖలో అట్టడుగుస్థాయి ఉద్యోగి. కానీ, అంకితభావం, పనితీరులో మాత్రం ఉన్నత భావాలు కలిగిన హోంగార్డు. తన పని తాను నిజాయితీగా, నిక్కచ్చిగా, పర్ఫెక్ట్‌గా చేసుకునిపోవడమే అతని పాలసీ. ఆ పనితీరే, ఆ అంకిత భావమే… ఏకంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్ కళ్లల్లో పడేలా చేసింది. అబిడ్స్‌ సర్కిల్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తించే అష్రఫ్‌ అలీని నిత్యం అదే రూట్లో వెళ్లే హైకోర్టు చీఫ్‌ జస్టిస్ సతీష్‌ చంద్ర గమనించేవారు. ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న తీరును ప్రతి రోజూ అబ్జర్వ్‌ చేసేవారు. అష్రఫ్‌ అలీ పనితీరుకు, అతని అంకితభావానికి ముగ్ధులైన హైకోర్టు సీజే, ఇవాళ హోంగార్డును అభినందించారు. తన కారును ఆపి, బొకేతో అప్రిషియేట్ చేశారు. ఏకంగా హైకోర్టు సీజేనే అభినందించడంతో సంతోషంలో మునిగిపోయాడు హోంగార్డ్‌ అష్రఫ్ అలీ.

.

Also Read: మనసు మార్చుకున్న సీఎం జగన్.. కొత్త మంత్రివర్గంలో ఆ 10 మందిని కొనసాగించే చాన్స్!