“తెలంగాణ జరూర్‌ ఆనా”.. మిస్‌ వరల్డ్‌ పోటీలకు రావాలంటూ సెలబ్రిటీల ప్రచారం!

హైదరాబాద్‌ వేదికగా ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో మిస్‌ వరల్డ్‌ పోటీల గురించి తెలంగాణ పర్యాటక శాఖ సెలబ్రిటీలు, స్పోర్ట్సు స్టార్లతో ప్రచారం చేయిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జరూర్ ఆనా’ అంటూ తెలంగాణ స్పోర్ట్సు స్టార్ పీవీ సింధూ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారతదేశం అందం, సంస్కృతి, ఐక్యతతో కూడిన ఈ ప్రపంచ వేడుక కోసం ఉత్సాహాన్ని పంచుకుందాం రండి తెలంగాణకు అంటూ పీవీ సిందూ పిలుపునిచ్చారు.

తెలంగాణ జరూర్‌ ఆనా.. మిస్‌ వరల్డ్‌ పోటీలకు రావాలంటూ సెలబ్రిటీల ప్రచారం!
Pv Sindhu

Updated on: May 05, 2025 | 11:57 AM

హైదరాబాద్‌ వేదికగా 72 మిస్ వరల్డ్ పోటీలు (Miss World 2025) జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ ప్రతిష్ఠాత్మ మిస్‌ వరల్డ్‌ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ పర్యాటక శాఖ చూసుకొంటోంది. ఈ నేపథ్యంలో మిస్‌ వరల్డ్‌ పోటీల గురించి సెలబ్రిటీలు, స్పోర్ట్సు స్టార్లతో ప్రచారం చేయిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జరూర్‌ ఆనా’ అంటూ తెలంగాణ స్పోర్ట్సు స్టార్ పీవీ సింధూ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో  భారతదేశం అందం, సంస్కృతి, ఐక్యతతో కూడిన ఈ ప్రపంచ వేడుక కోసం ఉత్సాహాన్ని పంచుకుందాం రండి తెలంగాణకు అంటూ పీవీ సిందూ పిలుపునిచ్చారు.

వీడియో చూడండి..

 

హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన 72 మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించబోతోంది.  ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో 120 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. నగరాని చేరుకుంటున్న ముద్దుగుమ్మలకు తెలంగాణ పర్యాటకశాఖ పూర్తి సాంప్రదాయ పద్ధతితో ఆహ్వానం పలుకుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.