వారిని ఓ కేసు కలిసేలా చేసింది. ఇంతకీ వారు ఎవరంటే టీడీపీ(TDP) మాజీ నాయకులు. వారు ఇప్పుడు ఎందుకు కలిశారంటే..
2005 సంవత్సరంలో దాదాపు 17 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరి నది(Godavari)పై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ(Babli) ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి వెళ్లిన నాటి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు నమోదు చేశారు. అయితే తర్వాత వారు వేరు వేరు పార్టీ లో చేరారు.
అప్పటి నుంచి ఆ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. నేడు ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. కేసులో ఉన్న మాజీ మంత్రులు తూళ్ల దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి, ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వేణుగోపాల చారి, కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, మారుతి, బొడ్డు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
వీరంతా కేసు విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాత మిత్రులు కలవడంతో ఒకరికొకరు మనస్సు విప్పి మాట్లాడుకున్నారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నాయకులతో పాటు కేసు వాదించిన న్యాయవాదులు ఫొటో దిగారు. ఇదే కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి కూడా ఊరట లభించింది.
Read Also.. Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..