
ఈ ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా అని చాలామందికి తెలుసు. మరి భారత్‌లో ఎత్తైన బిల్డింగ్ ఏది అంటే.. చాలామందికి తెలియకపోవచ్చు. ముంబైలోని ఇంపీరియల్ టవర్-1, టవర్-2 దేశంలో ఎత్తైన బిల్డింగ్స్‌గా ఖ్యాతి గడించాయి. మరి మన తెలంగాణ కేపిటల్ హైదరాబాద్‌లో ఎత్తైన బల్డింగ్ ఏదో తెలుసా..?. ఈ ప్రశ్నకు నూటికి 99 మందికి సమాధానం తెలియదు. ఆ ఆన్సర్ మేం పట్టుకొచ్చేశాం.
హైదరాబాద్ సిటీలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ కోకాపేట్లో సాస్క్రౌన్ పేరుతో తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఇదే నగరంలోనే ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఎత్తైన బిల్డింగ్. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణలోనే అతి ఎత్తైన బిల్డింగ్‌గా గుర్తింపు పొందింది. ఏకంగా 57 అంతస్థుల్లో 4.5 ఎకరాల విస్తీర్ణంలో నివాస భవనంగా దీని నిర్మాణం జరిగింది. పైన ఫ్లోర్ నుంచి చూస్తే.. సగం హైదరాబాద్ కనిపిస్తుంది. కింద నిలబడి చూస్తే ఆఖరి ప్లోర్ ఎక్కడుందో జాడ కూడా దొరకదు. ఈ పెద్ద భవనం హైదరాబాద్ నగరానికి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్‌గా నిలవనుంది. అయితే ఈ భారీ బిల్డింగ్‌లో ఒక అంతస్తుకు ఒక ప్లాట్ మాత్రమే ఉండటం మరో విశేషం. అయితే నగరవ్యాప్తంగా ఇంకా ఇలాంటి భారీ బిల్డింగ్‌లు ఇంకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 62 అంతస్థులు మరో భవనం అనుమతులు పొందే దశంలో ఉంది. దాని నిర్మాణం పూర్తయితే.. 57 అంతస్థుల భవనం రికార్డు బ్రేక్ అవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..