
హైదరాబాద్, జూన్ 14: ప్రయాణికులకు చేరువయ్యేందుకు తీసుకొచ్చిన టీ 24 టికెట్ ధరను పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచింది. సిటీ బస్సులో ప్రయాణించే సామన్యులకు ఆర్టీసీ నిర్ణయం కొంత షాకింగ్ అని చెప్పాలి. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచేసింది. ఇదిలావుంటే, సీనియర్ సిటిజన్ల(పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా సాధారణ ప్రయాణికులకు రూ.90గా నిర్ణయించింది. ఈ ధరలు జూన్ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో తెలిసింది.
గతంలో టీ-24 టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండగా.. ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించడంతో అంతా సంబరపడిపోయారు. పర్యటకులు కూడా ఈ ధరలతో సిటీ మొత్తం తిరిగేశారు. సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించింది. తాజాగా పాత ధరల్ని మరోసారి తీసుకొచ్చింది.
ఇదిలావుంటే, ఓ స్వీట్ న్యూస్ చెప్పింది. ఆర్డినరీ బస్సుల్లో కూడా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్(వీటీఎస్)ను తీసుకువస్తోందుకు ముమ్మర ఏర్పట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం ప్రయాణించాల్సిన బస్సు ఏ సమయంలో ఎక్కడికి వస్తుందో తెలిపేందుకు వీటీఎస్ పనికి వస్తుంది.
ఏ సమయానికి వస్తుందనే విషయాన్ని ప్రయాణికులు సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తిరిగే 900 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దీనిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు అన్ని సిటీ ఆర్డినరీ బస్సుల్లో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం