Watch Video: ఇక రోడ్లపై తాగుబోతులు రెచ్చిపోతే తాట తీసుడే.. సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసుల మాస్‌ వార్నింగ్!

నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ & డ్రైవ్, వాహన తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఈ రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఏ శ్రీనివాస్ పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. బాలకృష్ణ నేతృత్వంలో దీనిని నిర్వహించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ జాని పాషా సబ్‌ఇన్‌స్పెక్టర్ మనసాతోపాటు మొత్తం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ సిబ్బంది కలిసి నారాయణగూడ మెట్రో స్టేషన్..

Watch Video: ఇక రోడ్లపై తాగుబోతులు రెచ్చిపోతే తాట తీసుడే.. సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసుల మాస్‌ వార్నింగ్!
Sultanbazar Traffic Police Inspection Drive

Edited By: SN Pasha

Updated on: Nov 09, 2025 | 10:48 PM

నారాయణగూడ, నవంబర్‌ 9: నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ & డ్రైవ్, వాహన తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఈ రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈస్ట్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ ఏ శ్రీనివాస్ పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. బాలకృష్ణ నేతృత్వంలో దీనిని నిర్వహించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ జాని పాషా సబ్‌ఇన్‌స్పెక్టర్ మనసాతోపాటు మొత్తం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ సిబ్బంది కలిసి నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీ డ్రైవ్ నిర్వహించారు.

ఈ తనిఖీలలో సౌండ్ పొల్యూషన్ వాహనాలు, అలాగే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్ కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్‌కే పరిమితం కాకుండా, వాహన పత్రాలు, లైసెన్సులు, ఇతర నియమిత తనిఖీలు కూడా నిర్వహించారు. తద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం చురుకుగా పాల్గొన్నారు. పోలీసుల నినాదం ‘సేఫ్టీ ఫస్ట్’ (ముందుగా భద్రత) అని మరోసారి స్పష్టం చేశారు.

పోలీసులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ ‘మైనర్లకు వాహనం ఇవ్వకూడదని, ఇస్తే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని’ హెచ్చరించారు అలాగే, యువత సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రీల్స్, స్టంట్స్, ఇతర అసభ్యకర వీడియోలు తీయడం వంటి చర్యలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజా ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తనగా పరిగణించబడతాయి. పాపులారిటీ బదులు జైలుకు దారి తీస్తాయని యువత, వారి తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.