Hyderabad: ప్రతీ రోడ్డులో, ప్రతీ జంక్షన్‌లో నిఘా.. ఎగస్ట్రాలు చేస్తే డైరెక్ట్ జైలుకే

|

Dec 31, 2023 | 2:31 PM

యువకులు డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నడిపే వాహనాలపై, అలాగే బైక్స్‌పై ట్రిపుల్ రైడింగ్ ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేయనున్నారు. ఈ సమయాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Hyderabad: ప్రతీ రోడ్డులో, ప్రతీ జంక్షన్‌లో నిఘా.. ఎగస్ట్రాలు చేస్తే డైరెక్ట్ జైలుకే
New Year Celebrations
Follow us on

2023.. ఇంకొన్ని గంటల్లో చరిత్రగా మారబోతోంది. 2024 ఎంటర్ కాబోతోంది. సరికొత్త ఆశలు, సరికొత్త లక్ష్యాలతో 2024కి స్వాగతం పలికేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకుంటోంది యువత. అట్లుంటది మనతోని అంటూ డీజే టిల్లులు రెడీ అయిపోయారు. విందులు, చిందులు.. డీజే మోతలు.. జిగేల్ మనే లైట్లు.. సంబరాలతో తగ్గేదే లే అంటూ న్యూఇయర్‌ వెల్‌కమ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు. ఐతే.. పార్టీలు, పబ్‌లు, ఈవెంట్ల పేరుతో ఈసారి రచ్చ రచ్చ చేస్తే.. మోత మోగిస్తాం అంటున్నారు పోలీసులు.

న్యూ ఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌ కమ్‌ చెప్పడం తప్పు కాదు. కానీ జోష్‌ పేరిట ఎగస్ట్రాలేస్తే ముప్పు తప్పుదు. లైఫ్‌కు రిస్క్‌ తప్పదు. నిబంధనలు ఉల్లంఘించినా.. చట్టాన్ని అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవనేది పోలీసుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌. ముఖ్యంగా హైదరాబాద్‌‌లో న్యూ ఇయర్‌ సంబరాలపై ఫుల్ ఆంక్షలు విధించారు పోలీసులు.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాలకు ప్రవేశం ఉండదు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పాసులు ఉన్న వాహనాలను మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతిస్తారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్ యూనిఫామ్ ధరించడమే కాకుండా తమ డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని సూచించారు.

పబ్, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామనీ.. మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేది పోలీసుల మరో కండీషన్. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే రైడ్స్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి 8 గంటల నుంచి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక డ్రగ్స్ తీసుకునేవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీసు యంత్రాంగం. బ్రీత్‌ ఎనలైజర్స్‌ మాత్రమే కాదు డ్రంక్‌ అండ్‌ డ్రైవర్స్‌కు చెక్‌ పెట్టేలా గతంలో ఎన్నడూ లేని విధంగా హై ఎండ్‌ ఎక్విప్‌మెంట్‌ను వాడుతున్నారు హైదరాబాద్‌ పోలీసులు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..