Railway News: ఫలిస్తోన్న అధికారుల నిర్ణయాలు.. భారీగా పెరిగిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం.. ఎంతో తెలుసా.?

| Edited By: Ravi Kiran

May 04, 2022 | 5:18 PM

Railway News: కరోనా పరిస్థితుల తర్వాత దక్షిణ మధ్య రైల్వే ఆదాయం మళ్లీ భారీగా పుంజుకుంది. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, సిబ్బంది పనితీరు కారణంగా రైల్వే ఆదాయం భారీగా పెరిగింది. ఇటు సరకుల రవాణాతో పాటు ప్రయాణికుల రవాణాలో కూడా..

Railway News: ఫలిస్తోన్న అధికారుల నిర్ణయాలు.. భారీగా పెరిగిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం.. ఎంతో తెలుసా.?
Follow us on

Railway News: కరోనా పరిస్థితుల తర్వాత దక్షిణ మధ్య రైల్వే ఆదాయం మళ్లీ భారీగా పుంజుకుంది. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, సిబ్బంది పనితీరు కారణంగా రైల్వే ఆదాయం భారీగా పెరిగింది. ఇటు సరకుల రవాణాతో పాటు ప్రయాణికుల రవాణాలో కూడా ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. 2022 మే నెలలో సరుకు రవాణా లోడిరగ్‌, ప్రయాణికుల రవాణా ఆదాయ రంగాల్లో దక్షిణ మధ్య మంచి పనితీరును కనబరిచింది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే జోన్‌10.495 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌ సాధించింది. అంతేకాకుండా రూ.370.5 కోట్ల ప్రయాణికుల ఆదాయాన్ని సాధించింది. గతంతో పోలిస్తే ఇది అత్యధికం కావడం విశేషం.

దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బంది సరుకు రవాణాలో ఆటంకాలు ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు, సరుకు రవాణా కోసం అవసరమైన వ్యాగన్లను ఎప్పటికప్పుడు సరఫరా చేయడంతోనే ఈ స్థాయిలో ఆదాయం పెరిగింది. 2022 ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 5,337 వ్యాగన్లను సరఫరా చేశారు. ఇది గత సంవత్సరం కంటే 10% అధికం. ఏప్రిల్‌ నెలలో 10.495 మిలియన్‌ టన్నుల సరకు రవాణా లోడిరగ్‌ను నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే బొగ్గు రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో జోన్‌లో 5.273 మిలియన్‌ టన్నుల బొగ్గు లోడిరగ్‌ జరిగింది. గతేడాదితో పోలిస్తే ఇది 13% అధికం. సిమెంట్‌ (3.016 మిలియన్‌ టన్నులు), ఆహారధాన్యాలు (0.400 మిలియన్‌ టన్నులు), ఎరువులు (0.558 మిలియన్‌ టన్నులు), కంటైనర్లు (0.185 మిలియన్‌ టన్నులు) మరియు ఇతర సరుకులు (1.063 మిలియన్‌ టన్నులు) ఉన్నాయి.

కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ, ప్రణాళికమైన విధానాలతో ప్రయాణికుల రైళ్ల సేవలను పునరుద్ధరించారు. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి అన్‌రిజర్వడ్‌ రైళ్ల సర్వీసులను, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అన్‌రిజర్వడ్‌ కోచులను పునరుద్ధరించారు. ఈ చర్యల ఫలితంగా ఆదాయం భారీగా పెరిగింది. దీంతో ప్రయాణికుల రంగంలో ఏప్రిల్‌ నెలలో రూ.370.5 కోట్ల ఆదాయాన్ని సాధించింది. సంస్థ ఆదాయం పెరగడంలో కీలక పాత్ర పోషించిన జోన్‌ బందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు. సరుకు రవాణా లోడిరగ్‌లో ఉత్తమ పనితీరు కనబరచడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జోనల్‌, డివిజినల్‌ స్థాయిలలో ఆపరేషన్స్‌, కమర్షియల్‌ విభాగాల అధికారులు, సిబ్బంది చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Also Read: Viral Video: ఎయిర్ పోర్టులో లగేజీ ట్రాలీతో పరుగులు పెట్టిన సీత.. షాకైన ప్రయాణికులు..

Telangana: ఏకాంతంగా ఉన్నప్పుడు అటాక్.. మర్మాంగాలను ఛిద్రం చేసి.. చేసింది అతడే..

Robotic Mouse Viral Video: శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సరికొత్త రోబో ర్యాట్‌.. చుస్తే షాకే..