Vande Bharat Train: వందే భారత్ రైళ్లల్లో ప్రయాణించేవారికి బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

వందే భారత్ రైళ్లల్లో వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. నాలుగు వందే భారత్ ట్రైన్ల షెడ్యూల్స్‌లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. నిన్నటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో పాటు రైల్వేశాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటి అంటే..

Vande Bharat Train: వందే భారత్ రైళ్లల్లో ప్రయాణించేవారికి బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు

Updated on: Dec 06, 2025 | 8:02 AM

Vande Bharat Services: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్‌లో పలు మార్పులు చేసింది. కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్(ట్రై.నెం 20703/20704) ఇప్పటివరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉండేది కాదు. దానికి బదులుగా ఇప్పుడు శుక్రవారం ఆ ట్రైన్‌ను రద్దు చేశారు. ఇక సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (నెం.20707/20708) గతంలో గురువారం సర్వీసులు అందించేది కాదు. ఇప్పటి దానిని సోమవారానికి రద్దు చేస్తూ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే టైమింగ్స్,హాల్ట్‌లు, ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పులు చేయలేదు.

నిర్వహణ, సమయపాలన మెరుగుపర్చడం కోసం ఈ నాలుగు వందే భారత్ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైల్వే బోర్డు ఆమోదించిన తర్వాత షెడ్యూల్‌లో మార్పులు చేశారు. సేవా సామర్థ్యం పెండచం, నిర్వహణను క్రమబద్దీకరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రద్దు చేసిన రోజుల్లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నవారు రీఫండ్ పొందవచ్చని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్

అటు రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి – సాయినగర్ షిర్డీ – తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (17425/17426) కొత్తగా తీసుకొచ్చింది. డిసెంబర్ 14 నుంచి ఈ ట్రైన్ సర్వీసులు అందించనుంది. ప్రతీ ఆదివారం ఇది అందుబాటులో ఉండనుంది. ప్రతీ ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి సాయంత్రం 4.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఇక సోమవారం ఉదయం 10.45 గంటలకు షిర్డీ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో రెండు ఏసీ బోగీలతో పాటు జనరల్ సెంకడ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.