హైదరాబాద్(Hyderabad) గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జమ్మూకశ్మీర్(Jammu-Kashmir) కు చెందిన కృతి సంబ్యాల్ హైదరాబాద్ లోని అమెజాన్(Amazon) కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. గచ్చిబౌలి నుంచి నానక్ రామ్ గూడ లోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరు రూమ్మేట్స్ తో కలిసి నివసిస్తోంది. రూమ్ మేట్స్ లో ఒకరు ఢిల్లీకి వెళ్లగా.. మరొకర ఆఫీస్ కు వెళ్లారు. ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటున్న కృతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె తన స్నేహితుడికి తాను చనిపోతున్నట్లు వాట్సాప్ మెసేజ్ చేసింది. అతను ప్లాట్ కు వచ్చి చూసే సరికి తాళం వేసి ఉంది. దీంతో ఫోన్ చేశాడు. అయినా స్పందించకపోవడంతో అతను కృతి రూమ్ మేట్ కు ఫోన్ చేశాడు. ఆమె తాళం పంపించింది. దాంతో తలుపులు ఓపెన్ చూసి చూడగా కృతి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమె స్నేహితులు ఆస్పత్రికి తరలించగా కృతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. జీవితంలో వచ్చే చిన్నపాటి కారణాలకే ఆత్మహత్య చేసుకోవడం సరికాదని, వాటి పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలే గానీ కన్నవాళ్లకు కడుపుకోత మిగల్చవద్దని వైద్యులు, పోలీసులు కోరుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి