Hyderabad: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. సున్నిత మనస్కులు చూడొద్దు.. క్షణకాలంలో గాల్లో కలిసిపోయిన ప్రాణం

ఆ దంపతులు రోడ్డు పక్కన ఎడమవైపున బైక్‌పై వెళ్తున్నారు. రెప్పపాటులో ఓ లారీ దూసుకువచ్చి వారి బైక్‌ను ఢీకొట్టింది. అంతే క్షణాల్లో ఓ ప్రాణం గాల్లో కలిసిపోయింది.

Hyderabad: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. సున్నిత మనస్కులు చూడొద్దు.. క్షణకాలంలో గాల్లో కలిసిపోయిన ప్రాణం
Hyderabad Accident

Updated on: Apr 08, 2022 | 10:57 AM

(గమనిక: ఈ కథనం, దిగువ వీడియోలోని విజువల్స్ మిమ్మల్ని కలచివేయవచ్చు. సున్నిత మనస్కులు ఈ వార్తలోని వీడియో చూడొద్దని కొరుతున్నాం)

Road Accident: రోడ్డుపై వెళ్లేటపుడు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తప్పు అవతలి వారిదైనా.. మనమే బాధ్యులం అవుతాం. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని రామాంతపూర్‌(Ramanthapur)లో ఇలాంటి ప్రమాదమే జరిగింది.భార్యాభర్తలు ఇద్దరూ బైక్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈక్రమంలో బండి కంట్రోల్ తప్పి కిందపడిపోయారు. క్షణాల్లో ఆ లారీ వాళ్ల మీదుగా వెళ్లిపోయింది. రామంతపూర్ చర్చ్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రామంతపూర్‌కు చెందిన దంపతులు పున్నగిరి, కమల టూవీలర్ వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కమల పైనుంచి లారీ వెళ్లడంతో.. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. భర్త పున్నగిరి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana: యువతి ప్రాణం తీసిన వాట్సాప్ స్టేటస్.. తల్లిదండ్రులకు కడుపు కోత