సెలవులు, పండుగలు, శభకార్యాలు ఉండటంతో ప్రయాణాలు పెరుగుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా మంది ప్రజలు రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీతో రైళ్లు కిటకిటలాడుతుంటాయి. ముందస్తుగా టికెట్ బుక్ చేసుకుంటేనే సీట్ కన్ఫామ్ అవుతోంది. అయితే ఎలాంటి ప్రణాళిక లేకుండా ఉన్నపళంగా వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తితే మాత్రం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫలితంగా రైళ్లలో అనూహ్యంగా రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో రైల్వే అధికారులు అప్రమత్తమై ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంటారు. రద్దీ మార్గాల్లో ఉండే క్రేజ్ ను తట్టుకునే విధంగా స్పెషల్ ట్రైన్స్ ను నడిపిస్తుంటారు. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రూట్లలో ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్- నాగర్ సోల్, హైదరాబాద్- యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్- తిరుపతి, సికింద్రాబాద్ – నర్సాపూర్, నర్సాపూర్- వికారాబాద్ మధ్య ఈ రైళ్లు నడపనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Special Trains between various destinations @drmsecunderabad @VijayawadaSCR @drmhyb @drmgnt @drmgtl @drmned pic.twitter.com/Utj0ks46CO
ఇవి కూడా చదవండి— South Central Railway (@SCRailwayIndia) August 20, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..