రైళ్లలో వేసవి రద్దీ(Summer Trains) ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వనుండటంతో స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. ఊళ్లకు వెళ్లేందుకు నెల రోజుల ముందు నుంచే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లు.. ప్రయాణికుల రద్దీకి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో దక్షిణ మధ్య రైల్వే(South Centra Trains) అధికారులు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో స్పెషల్ ట్రైన్ సర్వీసులు తిప్పుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ, నర్సాపురం నగరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటన జారీ చేశారు. రైలు నంబరు 07187 గల ప్రత్యేక రైలు సోమవారం రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7.30 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.
07188 నంబర్ గల ప్రత్యేక రైలు.. సోమవారం ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 6.45కి కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది. 07169 ప్రత్యేక రైలు సోమవారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
Also Read
IPL 2022: 14 ఏళ్ల క్రితం ఐపీఎల్‌లో ఆడిన ఆ ఇద్దరు ఆటగాళ్లు.. ఇప్పుడు ఈ సీజన్‌లో కూడా ఆడుతున్నారు..
AP News: మంత్రి ఉష శ్రీచరణ్ కు వింత అనుభవం.. పూజలు చేస్తుండగా ఒడిలో కూర్చున్న వానరం