హైదరాబాద్ శివారులో హైవేపై పట్టపగలే జరగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం దగ్గర హైవేపై అందరూ చూస్తుండగా, కర్కశంగా గొడ్డలితో నరికి ఓ వ్యక్తిని దుండగులు హతమార్చారు. అనంతరం ఇద్దరు హంతకులు దర్జాగా రోడ్డు దాటి టూవీలర్‌పై వెళ్లిపోయారు. ఇది చూసిన జనం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేశారు. దీంతో.. కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కాగా.. మృతుడుని మహబూబ్‌గా గుర్తించారు. ఇతడు పలు హత్య కేసుల్లో నిందితుడు. అయితే.. ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. ముషీరాబాద్‌కు చెందిన మహబూబ్ 5 నెలల క్రితం పటాన్ చెరు లక్డారం దగ్గర జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు.