ప్రియురాలికోసం దొంగగా మారిన యువకుడు

| Edited By:

Apr 27, 2019 | 10:20 AM

తన ప్రియురాలిని సంతోషపెట్టడం కోసం చోరీలకు పాల్పడుతున్న పేరుమోసిన దొంగ బల్వీర్‌సింగ్‌ను ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. నగరంలోని సుల్తాన్‌బజార్‌లోగల బడీచౌడికి చెందిన బల్వీర్‌సింగ్‌ అలియాస్‌ బల్లు(25) ఇళ్లలో చోరీలు చేయడంలో దిట్ట. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతుంటాడు. నగరంలోని పలు పోలీసు స్టేషన్ల పరిధుల్లో చోరీలు చేసి పలుమార్లు జైలుకెళ్లి వచ్చాడు. డిగ్రీ వరకు చదువుకున్న బల్వీర్‌సింగ్‌ సంపన్న కుటుంబానికి చెందినవాడు. కాచిగూడ ప్రాంతంలో నెలకు రూ.3 లక్షల వరకు […]

ప్రియురాలికోసం దొంగగా మారిన యువకుడు
Follow us on

తన ప్రియురాలిని సంతోషపెట్టడం కోసం చోరీలకు పాల్పడుతున్న పేరుమోసిన దొంగ బల్వీర్‌సింగ్‌ను ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. నగరంలోని సుల్తాన్‌బజార్‌లోగల బడీచౌడికి చెందిన బల్వీర్‌సింగ్‌ అలియాస్‌ బల్లు(25) ఇళ్లలో చోరీలు చేయడంలో దిట్ట. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతుంటాడు. నగరంలోని పలు పోలీసు స్టేషన్ల పరిధుల్లో చోరీలు చేసి పలుమార్లు జైలుకెళ్లి వచ్చాడు. డిగ్రీ వరకు చదువుకున్న బల్వీర్‌సింగ్‌ సంపన్న కుటుంబానికి చెందినవాడు. కాచిగూడ ప్రాంతంలో నెలకు రూ.3 లక్షల వరకు అద్దెలు వచ్చే భవనాలు ఇతనికి ఉన్నాయి. బల్వీర్‌సింగ్‌ ప్రియురాలు బెంగళూరులోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నట్లు తెలిసింది. ప్రియురాలికి విలువైన బహుమతులు ఇస్తూ, ఆమెను సంతోషపెట్టడం కోసం చోరీలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల బల్కంపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల ఓ ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు. పోలీసులు వలపన్ని నిందితుణ్ని పట్టుకున్నారు. శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.