Hyderabad: రేవంత్ సర్కార్ నయా ప్లాన్.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్.. ఆ సమస్యలు లేకుండా..

Satellite City of Hyderabad: హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పటికే సిటీ కోటిన్నర జనాభాను క్రాస్ చేసింది. ఎన్ని ఎర్పాట్లు చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ తో పాటు కోన్ని ఇబ్బందులు సిటీని వెంటాడుతున్నాయి. భాగ్యనగరం భవిష్యత్ విస్తరణను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

Hyderabad: రేవంత్ సర్కార్ నయా ప్లాన్.. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్.. ఆ సమస్యలు లేకుండా..
Hyderabad

Edited By:

Updated on: Jan 04, 2024 | 12:41 PM

Satellite City of Hyderabad: హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పటికే సిటీ కోటిన్నర జనాభాను క్రాస్ చేసింది. ఎన్ని ఎర్పాట్లు చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ తో పాటు కోన్ని ఇబ్బందులు సిటీని వెంటాడుతున్నాయి. భాగ్యనగరం భవిష్యత్ విస్తరణను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ ప్రాంతంలో మెగా టౌన్ షిప్స్ నిర్మాణంపై పోకస్ చేయ్యాలని డిసైడ్ చేసింది. నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కోటిన్నర వరకు జనాభా నివాసం ఉంటున్నారు. ఇంకా సిటీ విస్తరిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగా సిటీ చుట్టూ మౌలిక వసతులు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. గ్రేటర్ పరిధిలో ఒక్కో ఏరియాలో ఒక్కో రంగం అభివృద్ధి చెందాయి. మరికొన్ని ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అయితే సిటీ నలువైపులా అభివృద్ధి చేసేలా గత కొంతకాలంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో భూములు సేకరించి అన్ని సౌకర్యాలతో లే-అవుట్లు ఏర్పాటు చేసి అక్కడ అన్ని సౌకర్యాలకు భూములు కేటాయించింది.

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు కూడా సిటీ డెవలప్మెంట్ పై ఫోకస్ చేసింది. నగరం చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేసేలా ప్రణాళిలు రూపోందిస్తున్నట్లు తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు, రిజినల్ రింగ్ రోడ్డు మధ్యలో అన్ని సౌకర్యాలతో శాటిలైట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరంపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. మేడ్చల్, సంగారెడ్డి, షాద్ నగర్, ఘట్కేసర్ ఇలా సిటీకి నాలుగు దిక్కుల అన్ని వసతులు కల్పించి ప్రత్యేక టౌన్ షిప్స్ ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

ఉపాధి కల్పన కోసం ప్రతి ఏటా సిటీకి లక్షలాది మంది వలసలు వస్తున్నారు. అలా నిత్యం సిటీకి వలసలు పెరగకుండా ఉండాలంటే సిటి సమీపంలో ఉపాధి కల్పన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయ్యడంతో పాటు స్కూల్స్, ఆసుపత్రులు, పౌర సేవలు, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలు ఎర్పాటు చేయాలంటున్నారు. దాంతో సిటీపై జనాభా భారం తగ్గడమే కాకుండా బెంగళూర్, ఢిల్లీ నగరాల లాగా ట్రాపిక్-కాలుష్యం సమస్యలు తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us