Rachakonda CP Mahesh Bhagwat: మహిళలపై రోజురోజుకు అత్యచారాలు పెరిగిపోతున్నాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. నిర్భయ చట్టం వచ్చినా మహళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదని అన్నారు. చదువుకున్న వారు కూడా మహిళలను వేధిస్తున్నారని, మహిళలకు అండగా నిలిచేందుకు సంఘ మిత్రలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశీ వరకట్నం కేసులు కూడా పెరిగిపోతున్నాయని చెప్పార. మహిళా పోలీసులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని అన్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగకుండా ఎంత కఠినమైన చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టామని, అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.
అత్యాచారాల విషయంలో ప్రత్యేక చట్టాలు వచ్చాయని, అయినా ఇంకా అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలపై ఎన్నిఅవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినా.. విధంగా బుద్ది చెప్పినా కొందరు తీరు మారడం లేదన్నారు.
Also Read: Madras High Court: తాళం వేసిన గదిలో ఆడ, మగ ఉంటే ఎలాంటి తప్పులేదు: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు