
మధ్య ఛత్తీగడ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. నైరుతి మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం.. ఈరోజు(గురువారం), రేపు(శుక్రవారం) రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు(గురువారం) నుంచి వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.
ఈరోజు(గురు), రేపు(శుక్ర) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఈరోజు(గురువారం) గరిష్టంగా భద్రాచలంలో 39.4 కనిష్టంగా హైదరాబాద్ లో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాచలం, మహబూబ్‌నగర్, ఖమ్మంలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్..41
నిజామాబాద్..39.5
మెదక్..39.4
భద్రాచలం..38.2
మహబూబ్ నగర్..37.9
ఖమ్మం..37.6
నల్లగొండ..36
హనుమకొండ..35.5
రామగుండం..35.2
హైదరాబాద్..34.7