Heavy Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం.. నేలకొరిగిన చెట్లు..

|

Apr 13, 2023 | 6:34 PM

హైద‌రాబాద్ సిటీలో ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురుస్తోంది. హైదరాబాద్- సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలి వాన కురిసింది. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌..

Heavy Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం.. నేలకొరిగిన చెట్లు..
Rain
Follow us on

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్నాహం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. హైద‌రాబాద్ సిటీలో ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురుస్తోంది. హైదరాబాద్- సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో గాలి వాన కురిసింది. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌తో పాటు సైదాబాద్‌, మాదన్నపేట్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, రాంనగర్‌, మారేడుపల్లిలో వడగళ్ల వాన కురిసింది. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. భారీ వ‌ర్షం కురియ‌డంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

హైకోర్టు దగ్గర భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు నెలకొరగడంతో రెండు ద్విచక్ర వాహనాలు, కారు ద్వంసం అయ్యాయి. ఇదే ఘటనలో ఓ చిన్నారితో పాటు మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హైకోర్టు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఆరామ్‌ఘర్‌ వైపు వెళ్లే రోడ్డులో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాలకు వెళ్లే బస్సులు, వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వాతావరణ హెచ్చరిక..

ఇదిలావుంటే, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ సూచించింది. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడాని వర్షం కురుస్తుందని హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం