రాబోయే 36 గంటల్లో గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 12వ తేదీ తర్వాత బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో 13 నుంచి గ్రేటర్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.