TS Weather: జూన్ 5 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల్లో వర్షాలు.. వాతావారణ శాఖ

|

May 31, 2022 | 6:34 AM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవావరణ కేంద్రం వెల్లడించింది.

TS Weather: జూన్ 5 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల్లో వర్షాలు.. వాతావారణ శాఖ
Rains
Follow us on

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. జూన్ 5న తెలంగాణకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. “జూన్ 5న తెలంగాణలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి” అని శ్రావణి పేర్కొన్నారు. “ఉదయం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతుంటాయి. తెలంగాణలో రుతుపవనాలు జూన్ 5 లేదా 6 న పురోగమిస్తాయి. అప్పటి వరకు ఉష్ణోగ్రత 32 నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుంది. అలాగే హైదారాబాద్‌లోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి” అని ఆమె పేర్కొన్నారు.

కాగా, కన్నూర్, పాలక్కాడ్ పరిసర ప్రాంతాల గుండా రుతుపవనాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే 3-4 రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర కేరళ, కర్ణాటక తీరం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు కేరళ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీంతో రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.