సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు

Pushpa 2 stampede case: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్ ఫైల్‌ అయ్యింది. 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్‌ వేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. మరీ కేసులో పోలీసుల నెక్ట్స్ స్టెప్‌ ఏంటి...? ఎవరెవర్ని విచారణకు పిలిచే అవకాశం ఉంది...? ఇప్పుడివే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
Sandhya Theatre Stampede Case

Updated on: Dec 27, 2025 | 4:52 PM

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్ ఫైల్‌ అయ్యింది. 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్‌ వేశారు. థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్ పేరును నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించడంతోపాటు.. 23 మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8మంది బౌన్సర్లపై ఛార్జిషీట్ నమోదు చేశారు.

2024 డిసెంబర్‌ 4న పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో… రేవతి అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి చనిపోయింది. ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పలువురిని ఇవాళ చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..