రాత్రి 10గంటలకు ముందు ప్రైవేట్ బస్సులకు ‘నో’ ఎంట్రీ

| Edited By:

Jun 18, 2019 | 12:47 PM

రాత్రి 10గంటలకు ముందు ప్రైవేట్ బస్సులు నగరంలోకి ప్రవేశించరాదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. దూరప్రాంతాలకు నడిపే బస్సుల యజమానులు, నిర్వాహకులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేయడమే కాకుండా.. బస్సులను సీజ్ చేసి రవాణాశాఖకు అప్పగిస్తామని ఈ సందర్భంగా అనిల్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రైవేట్ ట్రావెలర్లతో […]

రాత్రి 10గంటలకు ముందు ప్రైవేట్ బస్సులకు ‘నో’ ఎంట్రీ
Follow us on

రాత్రి 10గంటలకు ముందు ప్రైవేట్ బస్సులు నగరంలోకి ప్రవేశించరాదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ కుమార్ హెచ్చరించారు. దూరప్రాంతాలకు నడిపే బస్సుల యజమానులు, నిర్వాహకులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేయడమే కాకుండా.. బస్సులను సీజ్ చేసి రవాణాశాఖకు అప్పగిస్తామని ఈ సందర్భంగా అనిల్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రైవేట్ ట్రావెలర్లతో సమావేశాలు నిర్వహించాలని.. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు, దించేందుకు నగరంలో అనువుగా ఉన్న పార్కింగ్ స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు.. వారిని గోషామహల్‌లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రాలకు పంపించాలని కోరారు.