అయోధ్యలో రామ్‌లలా విగ్రహప్రతిష్ఠాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో జరిగే.. మహోన్నత క్రతువును తిలకించేందుకు.. యావత్ హిందూ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ శుభ సమయంలో.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునప్నారు. రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం వేళ.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున సొమ్మును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కుట్రపన్నారు. దీనికోసం.. ‘అయోధ్య ఎక్స్‌క్లూజీవ్ ఫోటోలు’ ఉన్నాయని పేర్కొంటూ ఆన్‌లైన్‌లో లింక్‌లు సర్కులేట్ చేస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే మీ ఖాతాలలోని నగదు గల్లంతనట్లే. ఇలాంటి హానికర లింక్స్ తో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
“జనవరి 22, 2024… ఆ తర్వాత, ‘అయోధ్య లైవ్ ఫోటోలు’ లాంటి పేరుతో ఉన్న అనేక లింక్స్ మీ మొబైల్స్‌కు మెసెజీల రూపంలో వచ్చే అవకాశం ఉంది. మీరు అలాంటి లింక్‌లను క్లిక్ చేయవద్దు. పొరపాటున వాటిని ఓపెన్ చేస్తే మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు. మీ బ్యాంక్ ఖాతాలు నుంచి నగదు దోచుకునే అవకాశం ఉంది” అని సైబర్ క్రైమ్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై అవగాహన లేని.. సీనియర్ సిటిజన్‌లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేసే అవకాశం ఉందని.. వారిని అలెర్ట్ చేయాలని సూచించారు. అదే విధంగా ఈ మెసేజ్‌ను అందరికి సర్కులేట్ చేయాలని సూచించారు.
ఎవరైనా ఓటిపీ నెంబర్లు చెప్పాలని అడిగినా.. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పినా.. ఫోన్లలో ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం మంచిది. లేకపోతే.. ఖాతాల్లోని నగదు మాయమయ్యే అవకాశం ఉంది. ఇంకా లింకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..