Trains: వేసవి రద్దీతో కిటకిటలాడుతున్న రైళ్లు.. ప్రయాణికులకు సరిపడా ట్రైన్స్ లేక ఇబ్బందులు

|

Apr 15, 2022 | 6:56 AM

వేసవి(Summer) కారణంగా రైళ్లలో రద్దీ నెలకొంది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక రైళ్లు(Special Trains) ప్రకటించారు. రద్దీకి అవి ఏ మాత్రం చాలడం లేదు. కరోనా కారణంగా రెండేళ్లు శుభకార్యాలు, వివాహాలు వాయిదా పడ్డాయి....

Trains: వేసవి రద్దీతో కిటకిటలాడుతున్న రైళ్లు.. ప్రయాణికులకు సరిపడా ట్రైన్స్ లేక ఇబ్బందులు
Trains
Follow us on

వేసవి(Summer) కారణంగా రైళ్లలో రద్దీ నెలకొంది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక రైళ్లు(Special Trains) ప్రకటించారు. రద్దీకి అవి ఏ మాత్రం చాలడం లేదు. కరోనా కారణంగా రెండేళ్లు శుభకార్యాలు, వివాహాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ సారి వాటిని నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనాకు ముందు ఏటా 60-70 ప్రత్యేక రైళ్లు నడిపే దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ఈ సారి మొక్కుబడిగా కేవలం 19 ప్రత్యేక రైళ్లను మాత్రమే ప్రకటించడం గమనార్హం. రైళ్లు లేకపోవడంతో ఇతర ప్రయాణ వనరులు వినియోగించుకోలేని సామాన్యులు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. కరోనాకు ముందు వేసవి వస్తుందంటే.. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టేవారు. రద్దీ మార్గాలను ముందే నిర్దేశించుకుని వాటికి తగ్గట్లు రైళ్లను ప్రకటించారు. అయితే ఈ సారి అలా చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వేసవిలో పాఠశాలలకు సెలవులు ఇస్తారు. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు పలువురు పర్యాటక బాట పడతారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైేన తిరుపతికి రోజూ నగరం నుంచి ఏడు రైళ్లు నడుస్తున్నా.. వేసవి భక్తులకు అవి సరిపోవడం లేదు. సికింద్రాబాద్‌ – రామేశ్వరం వారానికి ఒకటి నడుస్తోంది. తిరుపతి – రామేశ్వరం వెళ్లేందుకు వారానికి మూడు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లను సికింద్రాబాద్‌ వరకూ పెంచితే విజయవాడ, సికింద్రాబాద్‌ మార్గాల్లో ఉన్న ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. షిర్డీకి రోజూ నగరం నుంచి మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత వయా సికింద్రాబాద్‌ నుంచి కొన్ని రైళ్లు ఉన్నా.. అవి సరిపోవడంలేదు.

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మీదుగా వెళ్లే రైళ్లు ఎప్పుడు చూసినా కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడు రైళ్ల వరకూ ఉన్నా రద్దీ అధికంగా ఉంటోంది. వేసవి సెలవులతో పాటు పెళ్లిళ్ల కాలం కావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. రైళ్లు సరిపడా లేక అనేకమంది ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు.

Also  Read

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్‌బీఏ పై వడ్డీని భారీగా తగ్గించిన సర్కార్..

Viral Video: ఒరే బుడ్డొడా ఏంట్రా ఇదీ.. ఒక్క దెబ్బతో చదువంతా బుర్రకెక్కాలట.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

History Creator: ఒకే ఓవర్లో 6 వికెట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు..